Translate

Sunday, June 23, 2024

కొత్తగా యూట్యూబ్ ఛానెల్ పెట్టారా? ఫ్రీ ఇమేజ్ లు, మ్యూజిక్ ట్రాక్స్ అందించే వెబ్ సైట్లు ఇవే!

 

కొత్తగా యూట్యూబ్ ఛానెల్ పెట్టారా? ఫ్రీ ఇమేజ్ లు, మ్యూజిక్ ట్రాక్స్ అందించే వెబ్ సైట్లు ఇవే!

ప్రస్తుతం అంతా సోషల్ మీడియా(Social media) యుగం నడుస్తోంది. పొద్దున్నే నిద్రలేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మన జీవనవిధానాన్ని ఓ రకంగా సోషల్ మీడియా డిసైడ్ చేస్తుందనే చెప్పవచ్చు.

కొంతమందికి రోజులో ఒక్క నిమిషం అయినా సోషల్ మీడియాలో గడపాల్పిందే..లేకుంటే ఏదో కోల్పోయిన భాధ పడుతుంటారు. అయితే మీరు కూడా మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్​గా ఉంటారా? సోషల్ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్ గా(Social Media Influencer)మారాలనుకుంటున్నారా? అయితే కొన్ని ముఖ్య విషయాలను గుర్తుంచుకోవాలి. వాటిలో ఒక ముఖ్యమైనది కాపీరైట్ సమస్య. సోషల్ మీడియాలో ఎలాంటి కాపీ రైట్(Copy right) స్ట్రైక్​ పడకుండా ఉండాలంటే, ప్రీమియం ఇమేజ్​ లు, ఆడియో ట్రాక్స్, వీడియోలు వాడాల్సి ఉంటుంది. ఇందుకోసం పెద్ద మొత్తంలోనే డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది అయితే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా పూర్తి ఉచితంగా ఫొటోలు, వీడియోలు, మ్యూజిక్​ ఫైల్స్​ అందించే వెబ్​సైట్స్ చాలానే ఉన్నాయి. వాటిల్లో కొన్ని ముఖ్యమైనవి ఇప్పుడు చూద్దాం.

ఉచిత హై క్వాలిటీ ఇమేజ్ లు,వీడియోల కోసం వెబ్ సైట్లు

Pixabay(పిక్సా బే) : ఈ వెబ్ సైట్ లో చాలా వరకు ఫ్రీ కంటెంట్ ఉంటుంది. ఫొటోలు, జిఫ్ ఫైల్స్​, మ్యూజిక్, సౌండ్​ ఎఫెక్ట్స్​, వెక్టార్స్, వీడియోస్ అన్నీ ఉంటాయి. వీటిని ఉచితంగా వాడుకోవచ్చు.

Pexels(పిక్సెల్స్) : ఈ వెబ్​సైట్ లో ఫ్రీ ఫొటోలు, 4కె స్టాక్ వీడియోలు, బ్యాక్​గ్రౌండ్​ ఇమేజ్​లు లభిస్తాయి. వీటిని పూర్తి ఉచితంగా వాడుకోవచ్చు. అయితే కొన్ని ఇమేజ్​లకు క్రెడిట్ ఇవ్వాలి..కొన్నింటికి అది కూడా అవసరం ఉండదు.

Freepik(ఫ్రీ పిక్) : ఇందులో ఫొటోలు, వీడియోలు, టెంప్లెట్స్,ఐకాన్​లు, పీఎస్​డీలు, 3డీ ఫొటోలు ఉంటాయి. వీటిని ఉచితంగా వాడుకోవచ్చు.

Freerange(ఫ్రీ రేంజ్) : ఇందులో ఫ్రీ స్టాక్ ఫొటోస్, ఇల్లస్ట్రేషన్స్​ ఉంటాయి. దీనిలో పాపులర్​ ఫొటోస్ అనే విభాగం ఉంది. దీంట్లో హైక్వాలిటీ ఫొటోలు చాలా ఉంటాయి. వాటిని ఫ్రీగా వాడుకోవచ్చు.

Unsplash(అన్ స్ప్లాష్) : ఇందులో రాయల్టీ ఫ్రీ స్టాక్ ఫొటోలు ఉంటాయి. స్ట్రీట్​ ఫొటోగ్రఫీ, ఫ్యాషన్, బ్యూటీ, వాల్​పేపర్స్​, 3డీ రెండర్స్, టెక్స్​చర్స్ విభాగాలకు చెందిన భిన్నమైన ఫొటోలు, ఇల్లస్ట్రేషన్లు ఉంటాయి. వీటిని ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు.

ఫ్రీ మ్యూజిక్ లేదా ఆడియా ట్రాక్ ల కోసం వెబ్ సైట్లు

Bensound(బెన్ సౌండ్) : ఇది వీడియో క్రియేటర్లకు బాగా ఉపయోగపడే వెబ్​సైట్. ఇందులో ఎంతో మంది సంగీత కళాకారులు రూపొందించిన లేటెస్ట్ మ్యూజిట్ ట్రాక్స్ ఉంటాయి. వాళ్లకు క్రెడిట్ ఇచ్చి, ఆడియో ట్రాక్స్​ను ఫ్రీగా మీ వీడియోల కోసం వాడుకోవచ్చు.

YouTube Audio Library(యూట్యూబ్ ఆడియో లైబ్రరీ): కంటెంట్ క్రియేటర్ల కోసం యూట్యూబ్ ప్రత్యేకంగా ఆడియో లైబ్రరీని తీసుకువచ్చింది. ఇందులో రాయల్టీ ఫ్రీ మ్యూజిక్, పబ్లిక్ డొమైన్​, క్రియేటివ్ కామన్స్ విభాగాలకు చెందిన అనేక ఆడియో ఫైల్స్ ఉంటాయి. అయితే కొన్నింటికి క్రెడిట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ​

Free Music Archive(యూట్యూబ్ మ్యూజిక్ ఆర్కైవ్) : ఇందులో రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ లభిస్తుంది. క్రియేటివ్​ కామన్స్​ లైసెన్స్​ కింద వీటిని వాడుకోవచ్చు.

SoundCloud : దీంట్లో ఉచితం, పెయిడ్​ సబ్​స్క్రిప్షన్ రెండూ ఉన్నాయి. మీరు ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చినట్లయితే ఫ్రీ సబ్​స్క్రిప్షన్ తీసుకుని ఆడియో ట్రాక్స్ ఉపయోగించుకోవచ్చు. అయితే మ్యూజిక్ కింద తప్పకుండా క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది.

Contentby: mannamweb.com


Saturday, June 15, 2024

వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను ఇలా చూడవచ్చు..ఈ ఈజీ ట్రిక్ చాలామందికి తెలియదు

వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను ఇలా చూడవచ్చు..ఈ ఈజీ ట్రిక్ చాలామందికి తెలియదు



ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాట్సాప్(Whatsapp)ని ఉపయోగిస్తుంటారు. దీంతో మెసేజ్ లు, ఫొటోలు, వీడియోలు సులభంగా షేర్ చేసుకోవచ్చు. యాప్‌లో కాలింగ్, వీడియో కాలింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.


గోప్యతని దృష్టిలో ఉంచుకుని యాప్‌లో అనేక గోప్యతా ఆధారిత ఫీచర్‌లు కూడా అందించబడ్డాయి. అలాంటి ఒక ఫీచర్ డిలీట్ ఫర్ ఎవ్రీవన్. దీని కారణంగా, రిసీవర్, పంపిన వారి చాట్‌ల నుండి మేసేజ్ లు డిలీట్ అయిపోతాయి.

కానీ, ఇది తొలగించబడిన మేసేజ్ ల జాడను వదిలివేస్తుంది. కొన్ని మేసేజ్ లు పంపబడినట్లు, తొలగించబడినట్లు చూపుతుంది. చాలా మంది డిలీట్ అయిన మెసేజ్ లలో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. దీని కోసం కొన్ని థర్డ్ పార్టీ యాప్‌లు ఉన్నాయి, కానీ వాటిని ఉపయోగించడం ప్రమాదకరం. అందువల్ల Android ఫోన్‌లలో అందుబాటులో ఉన్న ఇన్-బిల్ట్ ఫీచర్ గురించి ఇప్పుడు చూద్దాం, దీని ద్వారా తొలగించబడిన మెసేజ్ లను చదవవచ్చు.


తొలగించబడిన టెక్స్ట్ మెసేజ్ లు మాత్రమే దీని ద్వారా చెక్ చేయవచ్చు. ఈ ఫీచర్ ఫోటోలు లేదా ఆడియో సందేశాలకు ఉపయోగపడదు. అలాగే, ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 11, అంతకంటే ఎక్కువ ఆండ్రాయిడ్ వెర్షన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

డిలీట్ అయిన మెసేజ్ లను ఇలా చదవండి:

ముందుగా ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.

తర్వాత నోటిఫికేషన్‌లపై నొక్కండి.

దీని తర్వాత మరిన్ని సెట్టింగ్‌లకు(More settings) వెళ్లండి.

ఆపై నోటిఫికేషన్‌ల చరిత్రకు(Notifications history) వెళ్లండి.

ఆపై స్క్రీన్‌పై కనిపించే టోగుల్‌ను ఆన్ చేయండి.

ఈ ఫీచర్‌ని ఆన్ చేసిన తర్వాత, మీరు మళ్లీ Notifications ద్వారా నోటిఫికేషన్‌ల హిస్టరీకి వెళ్తారు. దీని ద్వారా మీరు 24 గంటల్లో డిలీట్ అయిన టెక్స్ట్ మెసేజ్ లను చూస్తారు.

Content By @mannamweb.com

గూగుల్‌ మ్యాప్‌ను తలదన్నే ఈ యాప్స్‌ గురించి మీకు తెలుసా? బెస్ట్‌ ఫీచర్స్‌

గూగుల్‌ మ్యాప్‌ను తలదన్నే ఈ యాప్స్‌ గురించి మీకు తెలుసా? బెస్ట్‌ ఫీచర్స్‌   Google Maps Alternative: ఇటీవల యూపీలో గూగుల్ మ్యాప్స్ కారణంగా ఓ ...