Translate

Wednesday, July 6, 2016

భారతీయా భాషల్లో మైక్రోసాఫ్ట్ ఇన్.పుట్ టూల్స్...


భారతీయ భాషల్లో మైక్రోసాఫ్ట్  ఇన్.పుట్ టూల్స్...

                           ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ సంస్థ 10 ప్రధాన భారతీయ భాషల్లో ఇన్.పుట్ టూల్స్ ని డెవలప్ చేసింది. నెట్ యూజర్స్ పెరగడం అలాగే పబ్లికేషన్ రంగంలో ఉపయుక్తంగా ఉండే విధంగా ఈ ఇండిక్ లాంగ్వేజ్ ఇన్.పుట్ టూల్ ఉపయోగపడుతుందని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్.మెంట్ సెంటర్ కార్పొరేట్ వి‌పి & ఎండి శ్రీని కొప్పాలు అన్నారు.


ఉదాహరణకు ‘మీరంతా బాగున్నారా’ అని తెలుగులో రాయాలంటే ఎంతో కష్టం. కానీ ఈ ఇన్.పుట్ టూల్స్ వల్ల మనం ఇంగ్లీష్ లోనే “Meeranta Bgunnara” అని టైప్ చేస్తే అది తెలుగు లోకి మారుతుంటుంది. ఇప్పటికే బ్లాగ్స్ లో ఉపయోగించే యూనీ కోడ్ ఇధే విధానాన్ని పోలి ఉంది. ఇలా ఎంత సమాచారన్నైనా ఇట్టే తెలుగులో టైప్ చేసుకునే వెసులుబాటును ఈ టూల్ కల్పిస్తుంది. 

ఈ టూల్ తెలుగు, బెంగాలి, గుజరాత్, మలయాళం, హిందీ, కన్నడ, తమిళం, మరాఠీ, ఒరియా, పంజాబీ భాషలలో లభిస్తుంది. ఈ సాఫ్ట్.వేర్ దేనిమీదైనా చక్కగా పనిచేస్తుంది. ఇప్పటికే నెట్ లో అందుబాటులో ఉంది. ఈ లాంగ్వేజ్ టూల్ ని http://specials.msn.co.in/ilit/Telugu.aspx అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతం అందరికీ ఉచితంగా ఈ ప్రాంతీయ భాష టూల్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సాఫ్ట్.వేర్ 3 ఎం‌బి స్పేస్ ని కలిగి ఉంది.

No comments:

Post a Comment

గూగుల్‌ మ్యాప్‌ను తలదన్నే ఈ యాప్స్‌ గురించి మీకు తెలుసా? బెస్ట్‌ ఫీచర్స్‌

గూగుల్‌ మ్యాప్‌ను తలదన్నే ఈ యాప్స్‌ గురించి మీకు తెలుసా? బెస్ట్‌ ఫీచర్స్‌   Google Maps Alternative: ఇటీవల యూపీలో గూగుల్ మ్యాప్స్ కారణంగా ఓ ...