Translate

Wednesday, March 6, 2019

ప్రతి ఒక్క భారతీయుడికి ఉపయోగపడే ప్రభుత్వ యాప్స్ మరియు ఫోన్ నంబర్లు

ప్రతి ఒక్క భారతీయుడికి ఉపయోగపడే ప్రభుత్వ యాప్స్ మరియు ఫోన్ నంబర్లు


కేంద్ర ప్రభుత్వం ఇండియాని 'డిజిటల్ ఇండియా' గా మార్చాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందే. డిజిటల్ ఇండియాలో భాగంగా దేశంలో వెనక పడిన అనేక గ్రామాల్లో ప్రజలు ఇంటర్నెట్ వినియోగించుకునేలా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించేందుకు భారీ ఎత్తున ప్రచారం కూడా చేస్తోంది.కాగా ప్రస్తుతం అనేక గవర్నమెంట్ యాప్స్ మరియు ఫోన్ నంబర్లు కేంద్రప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.ఏ చిన్న కష్టం వచ్చిన మీరు ఈ నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా ప్రభుత్వ సేవల కోసం ఉపయోగపడే యాప్స్,నంబర్స్ ను మీకు అందిస్తున్నాం.ఓ లుక్కేయండి

Bharat ke Veer

Bharat ke Veer

ఈ మొబైల్ యాప్ ద్వారా, విధి నిర్వహణలో వారి ప్రాణాలను పోగొట్టుకున్న 'Central Armed Police Forces' కుటుంబాలకు ఆర్ధికంగా సహాయం చేయవచ్చు.

cVigil

ఈ యాప్ ద్వారా ఎన్నికల్లో అక్రమ కార్యకలాపాల చేసే వ్యక్తుల వీడియోలను మరియు ఫోటోలను, అవినీతిని ప్రేరేపించే వ్యాఖ్యలను నేరుగా ఎన్నికల కమీషన్ కి పంపవచ్చు

MADAD

విదేశాల్లో ఇబ్బందుల్లో ఉన్న భారతీయ పౌరులకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన యాప్

UTS

భారతీయ రైల్వేలపై రిజిష్టర్ టికెట్లను బుక్ చేసుకోవాలనుకునేవారికి అప్లికేషన్

mPassport

ఈ యాప్ ద్వారా ప్రజలు ఎక్కడి నుంచైనా పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు

National Scholarships Portal

వివిధ కేంద్ర మంత్రిత్వశాఖలు మరియు స్టేట్ డిపార్టుమెంటులు అందించే వివిధ స్కాలర్షిప్ పథకాలకు వన్-స్టాప్ సొల్యూషన్.

1091

మహిళల హెల్ప్ లైన్

18001201740

మీరు BHIM యాప్ గురించి ప్రశ్నలను మరియు ఫిర్యాదులను కలిగి ఉంటే, మీరు ఈ 24/7 హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేయవచ్చు

Aaykar Setu

ఈ యాప్ ద్వారా పాన్ కార్డు కు అప్లై చేసుకోవచ్చు అలాగే టాక్స్ లు పే చేయవచ్చు

108

వరదలు లేదా భూకంపాలు వంటి జాతీయ విపత్తు విషయంలో, ఈ హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేయవచ్చు.

1909

స్పామ్ మెసేజ్లను ఆపడానికి TRAI యొక్క DND సేవను యాక్టివేట్ చెయ్యడానికి మీరు ఈ నెంబర్ కి మెసేజ్ చేస్తే చాలు.

ePathshala

ఈ యాప్ ద్వారా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు మొబైల్ లేదా డెస్క్ టాప్లలో ఇ-పుస్తకాలను యాక్సెస్ చేసుకోవచ్చు.

mKavach

ఈ ప్రభుత్వ యాప్ మాల్వేర్ వంటి మొబైల్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ను అందిస్తుంది అలాగే స్పామ్ మెసేజ్లను మరియు కాల్స్ ను కూడా బ్లాక్ చేస్తుంది.

Kisan Suvidha

ఈ యాప్ రైతుల కోసం డెవలప్ చేయబడినది.ఈ యాప్ ద్వారా రైతులు వాతావరణ రిపోర్టులు , మార్కెట్ ధరలు, మొక్కల సంరక్షణ చిట్కాలు ఇతర విషయాలు తెలుసుకోవచ్చు.

1947

ఆధార్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ టాల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోవచ్చు.

1800114949

ఏదైనా సైబర్ సెక్యూరిటీ త్రెట్స్ ఉంటె ఈ టాల్ ఫ్రీ నెంబర్ కు డయల్ చేయవచ్చు.

UMANG

UMANG (Unified Mobile Application for New-age Governance) ఈ యాప్ అన్ని ప్రభుత్వ రంగ డిపార్ట్‌మెంట్లను, వాటి సర్వీసులను ఒకే వేదికపైకి తీసుకొని వస్తుంది . ఆధార్‌, డిజిలాకర్‌, పేగవర్న్‌మెంట్‌ వంటి సర్వీసులను ఇది అందజేస్తుంది.

57575

దరఖాస్తుదారులు పైన పేర్కొన్న సందేశాన్ని పంపడం ద్వారా తమ పాన్ కార్డు అప్లికేషన్ స్టేటస్ ను ట్రాక్ చేయవచ్చు

Voter Helpline

భారతదేశ ఎన్నికల సంఘం యొక్క యాప్

Incredible India

ఇది ప్రభుత్వ టూరిజం యాప్‌.ఈ యాప్ ద్వారా టూర్‌ ఆపరేటర్లు, రిజిస్ట్రేషన్‌ సర్వీసు ప్రొవైడర్లు వంటి వారి వివరాలను తెలుసుకోవచ్చు

MySpeed (TRAI)

వినియోగదారులు ఈ డేటా ద్వారా వారి డేటా వేగం, కవరేజ్ ప్రాంతం మరియు ఇతర నెట్వర్క్ సంబంధిత సమాచారం గురించి TRAI కి తెలియజేయవచ్చు.

61098

ఎవరైనా పిల్లలు ఇబ్బందుల్లో ఉంటే ఈ నెంబర్ కు కాల్ చేసి తెలియజేయవచ్చు

BHIM

Bharat Interface for Money (BHIM) డిజిటల్ లావాదేవీలకు ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో వినియోగదారులు UPI చెల్లింపు అడ్రస్, ఫోన్ నంబర్లు లేదా QR కోడులు ఉపయోగించి డబ్బును పంపవచ్చు లేదా స్వీకరించవచ్చు.

Indian Police on Call

మీరు ఉన్న ప్రదేశంలోని సమీప పోలీసు స్టేషన్ను గుర్తిస్తుంది.దగ్గర లో ఉన్న పోలీసు స్టేషన్ చేరుకోవడానికి మార్గం మరియు దూరం వంటి అన్ని సమాచారాలను ఇస్తుంది . ఇది జిల్లా కంట్రోల్ రూమ్ మరియు SP కార్యాలయాలు ఎన్ని ఉన్నాయో ప్రదర్శిస్తుంది

Startup India

ఈ యాప్ ద్వారా బిజినెస్ చేయాలనుకునే కొత్త వారు ఏ బిజినెస్ చేస్తే లాభాలు వస్తాయో మరియు ఇతర వివరాలను ఈ యాప్ ద్వారా పొందవచ్చు. ప్రభుత్వాలు initiative చేసే స్టార్ట్ అప్స్ మరియు ఇంక్యూబేటర్స్ గురించి తెలుసుకోవడానికి ఈ యాప్ చాల ఉపయోగపడుతుంది.

DigiSevak

పలు ప్రభుత్వ రంగ పనులకు వాలంటీర్‌ సర్వీసులు అందజేయడానికి ఈ యాప్ ఉపయోగ పడుతుంది.

IRCTC

ప్రభుత్వంచే అత్యంత ప్రాచుర్యం పొందిన యాప్ ఇది.ఈ యాప్ ద్వారా ఐఆర్సిటిసి రైలు టిక్కెట్ల మరియు ఆన్ లైన్ బుకింగ్ చేసుకోవచ్చు . IRCTC ఇ-వాలెట్ తో ట్రాన్సక్షన్స్ చాలా త్వరగా చేసుకోవచ్చు.

1800 258 1800

పాస్ పోర్ట్ సంబంధిత ప్రశ్నలు మరియు ఫిర్యాదులు ఉంటే ఈ నెంబర్ కి కాల్ చేయవచ్చు.

1800 266 6868

పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధిత ప్రశ్నలు మరియు ఫిర్యాదులు ఉంటే ఈ టాల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోవచ్చు

DigiLocker

వినియోగదారులు డ్రైవింగ్ లైసెన్స్, PAN కార్డు వంటి డిజిటల్ కాపీలు ఈ యాప్ లో సేవ్ చేయవచ్చు

mParivahan

ఈ యాప్ ద్వారా, వినియోగదారులు వారి డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఫోర్ -వీలర్ / టూ -వీలర్ రెజిస్టరరిన్ సర్టిఫికేట్ యొక్క డిజిటల్ కాపీని పొందవచ్చు . సిటిజన్స్ ఇప్పటికే ఉన్న కార్ రిజిస్ట్రేషన్ వివరాలను అలాగే సెకండ్ హాండ్ కార్ల వివరాలను కూడా ఇందులో పొందవచ్చు . సెకండ్ హ్యాండ్ కారుని కొనుగోలు చేయడానికి చూస్తున్న వారికి, వారు వయస్సు మరియు ఇతర వివరాలు ఈ యాప్ ద్వారా పొందవచ్చు.

MyGov

వినియోగదారులు వివిధ మంత్రిత్వ మరియు అనుబంధ సంస్థలకు ఆలోచనలు మరియు సలహాలను ఈ యాప్ ద్వారా ఇవ్వొచ్చు.

eBasta app

ఉపాధ్యాయులు మరియు విద్యార్థులుకు ఉపయోగపడే యాప్

1800-11-0001

Pradhan Mantri Dhan Jan Yojanaకు సంబంధించిన సమాచారం కొరకు ఈ నెంబర్ కు డయల్ చేసి తెలుసుకోవచ్చు

7738299899

Employee Provident Fund balanceకు సంబంధించిన సమాచారం కొరకు ఈ నెంబర్ కు డయల్ చేసి తెలుసుకోవచ్చు

Taking this Information by https://telugu.gizbot.com/

No comments:

Post a Comment

గూగుల్‌ మ్యాప్‌ను తలదన్నే ఈ యాప్స్‌ గురించి మీకు తెలుసా? బెస్ట్‌ ఫీచర్స్‌

గూగుల్‌ మ్యాప్‌ను తలదన్నే ఈ యాప్స్‌ గురించి మీకు తెలుసా? బెస్ట్‌ ఫీచర్స్‌   Google Maps Alternative: ఇటీవల యూపీలో గూగుల్ మ్యాప్స్ కారణంగా ఓ ...