Translate

Wednesday, March 6, 2019

స్మార్ట్‌ఫోన్ లో రేడియేషన్ లెవెల్ చెక్ చేసుకోవడం ఎలా..? మరియు రేడియేషన్ నుంచి తప్పించుకునేందుకు కొన్ని చిట్కాలు

స్మార్ట్‌ఫోన్ లో రేడియేషన్ లెవెల్ చెక్ చేసుకోవడం ఎలా..?


ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ కొనేవాళ్ళు ముందుగా చూసేది ధర లేదా ఫీచర్స్.కానీ స్మార్ట్‌ఫోన్ కొనేముందు ముక్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు మరి కొన్ని ఉన్నాయి అవే ఆఫ్టర్-సేల్ సర్వీస్,రీసేల్ వ్యాల్యూ ,రేడియేషన్ లెవెల్.ప్రస్తుతం యూత్ అంత సెల్ ఫోన్లో తో బిజీ గ ఉన్నారు. అతిగా సెల్‌ ఫోన్‌లో మాట్లాడడం వల్ల మెదడుకూ ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మితిమీరుతున్న మాటల వల్ల రేడియేషన్‌ ప్రభావం పడుతోందని వైద్యులు చెబుతున్నారు.ఈ శీర్షికలో భాగంగా స్మార్ట్‌ఫోన్ లో రేడియేషన్ లెవెల్ ఎలా చెక్ చేసుకోవాలో మీకు తెలుపుతున్నాము.ఓ లుక్కేయండి

SAR ఎంత మంచిది?

SAR ఎంత మంచిది?

SAR స్థాయి 16W/Kgఉంటే సరిపోతుంది. కాబట్టి మీ ఫోన్ ఒక SAR విలువను 1.2లేదా దానిలో ఏదో ఉంటే చాలా ఫోన్లు 0.5 నుంచి 0.6పరిధిలో ఉన్నప్పటికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.అదే సమయంలో మీరు మొబైల్ డివైస్ వినియోగాన్ని మాట్లాడటం మరియు పరిమితం చేస్తున్నప్పుడు మొబైల్ తో ఇయర్ ఫోన్లను ఉపయోగించడం ద్వారా ఎక్స్ ప్లోజర్ ఫోన్ రేడియేషన్ను తగ్గించవచ్చు. అలాగే, సాధారణంగా పెద్ద బ్రాండ్స్ తక్కువ SARవిలువతో ఫోన్లను కలిగి ఉంటాయి.

SAR వ్యాల్యూ ఇలా చెక్ చేయండి

- మీ స్మార్ట్‌ఫోన్ అన్ లాక్ చేసి డైలర్ ను ఓపెన్ చేయండి
- డైలర్ లో ‘*#07# అనే కోడ్ ను టైప్ చేయండి
- మీ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ యొక్క SAR రేటింగ్ ఆటోమేటిక్ గా చూపిస్తుంది

IMEI నెంబర్ ను తెలుసుకోవడానికి ఇలా చేయండి

- మీ స్మార్ట్‌ఫోన్ లో డైలర్ ను ఓపెన్ చేయండి
- డైలర్ లో ‘*#06# అనే కోడ్ ను టైప్ చేయండి
- మీ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ యొక్క IMEI నెంబర్ ఆటోమేటిక్ గా చూపిస్తుంది

రేడియేషన్ నుంచి తప్పించుకునేందుకు కొన్ని చిట్కాలు

సెల్‌ఫోన్లు అనేవి నేటి తరుణంలో మనకు నిత్యావసర వస్తువులుగా మారాయి. అవి లేకుండా ఒక్క క్షణం ఉండలేం అనే స్థాయికి మనం చేరుకున్నాం. అంతలా అవి మన జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్లీ రాత్రి నిద్రించే వరకు సెల్‌ఫోన్లతోనే మనం కాలం గడుపుతున్నాం. కానీ వాటి వల్ల వచ్చే రేడియేషన్ ముప్పును మనం గమనిచడం లేదు. రేడియేషన్ అనేది కంటికి కనిపించే వెలుగు రూపంలో ఉండవచ్చు, కంటికి కనిపించని వేడి రూపంలో ఉండవచ్చు, కంటికి కనిపించని ఆల్ఫా రేణువులులా ఉండొచ్చు. అయితే కింద ఇచ్చిన పలు సూచనలు పాటిస్తే దాంతో సెల్‌ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ ముప్పును తప్పించుకోవచ్చు. ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రేడియేషన్ నుంచి తప్పించుకునేందుకు కొన్ని చిట్కాలు

టిప్ 1

ఫోన్‌ను వీలైనంత వరకు మీ శరీరానికి దూరంగా పెట్టుకోండి.అలాగే ఫోన్ వాడకపోయిన పక్షంలో పక్కన పెట్టేయండి. మీరు ఆఫీస్‌లో పనిచేస్తుంటే డెస్క్‌పై ఫోన్ పెట్టండి. ఫోన్ ఉపయోగం ఉంటేనే దాన్ని తీసుకోండి.

టిప్ 2

చాలా మంది బ్లూటూత్, ఎన్‌ఎఫ్‌సీ హెడ్‌సెట్లను వాడుతున్నారు. కానీ అవి వాడడం మంచిది కాదు. వాటికి బదులుగా వైర్‌తో ఉన్న హెడ్‌సెట్లను వాడితే సెల్‌ఫోన్ రేడియేషన్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.

టిప్ 3

ఫోన్లను ప్రత్యేక పర్సులలో పెట్టుకోండి. జేబుల్లో పెట్టుకోకండి. రాత్రి పూట నిద్రించేటప్పుడు చాలా మంది ఫోన్‌ను తల పక్కనే పెట్టుకుని నిద్రిస్తారు. కానీ అలా చేయరాదు. తలపక్కన ఫోన్ పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల ఎక్కువ రేడియేషన్ విడుదలయి అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.

టిప్ 4

ఫోన్‌ను చార్జింగ్ పెట్టినప్పుడు వాడకండి. అలాంటి సమయంలో వాటి నుంచి సాధారణ సమయాల్లో కన్నా అధిక రేడియేషన్ విడుదలవుతుంది. కనుక వాటిని చార్జింగ్ తీసి వాడితే మంచిది.

టిప్ 5

మార్కెట్‌లో మనకు సెల్‌ఫోన్‌ల వెనుక భాగంలో వేసే యాంటీ రేడియేషన్ స్టిక్కర్లు దొరుకుతున్నాయి. వాటిని ఫోన్ బ్యాక్ ప్యానెల్‌పై వేసుకుంటే సెల్‌ఫోన్ రేడియేషన్ ముప్పును కొంత వరకు తగ్గించుకోవచ్చు.

టిప్ 6

చిన్నారులకు సెల్‌ఫోన్లను ఇవ్వకండి. ఇవ్వాల్సి వస్తే సిమ్ తీసేసి ఇస్తే మంచిది. లేదంటే వారిపై రేడియేషన్ మరింత ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇక గర్భిణీలు సెల్‌ఫోన్లను వీలైనంత తక్కువ వాడితే మంచిది. లేదంటే కడుపులో ఉండే శిశువు ఆరోగ్యంపై అది ప్రభావం చూపుతుంది.

Taking this Information by https://telugu.gizbot.com/

No comments:

Post a Comment

How to Block a Program in a Firewall in 6 Steps (Easy Tutorial)

How to Block a Program in a Firewall in 6 Steps (Easy Tutorial) 1. Open the Settings for Windows Defender Firewall with Advanced Security  U...