Translate

Wednesday, March 6, 2019

ఇక మీదట వన్ నేషన్ , వన్ కార్డు : ఎలా పొందాలో తెలుసుకోండి

ఇక మీదట వన్ నేషన్ , వన్ కార్డు : ఎలా పొందాలో తెలుసుకోండి

దేశవ్యాప్తంగా ఒక చోట నుంచి మరోచోటకు వెళ్లాలంటే అందరూ పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ పై ఆధారపడుతుంటారు.ఈ ప్రయాణ సమయాల్లో ప్రతిచోట పేమెంట్ మోడ్ భిన్నంగా ఉంటుంది. దీంతో ప్రయాణ సమయాల్లో ప్యాసింజర్లు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇకపై ట్రావెల్ చేసేందుకు ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. జేబులో డబ్బుల్లేకపోయినా పర్లేదు. ఈ కార్డు ఉంటే చాలు.. దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఏదైనా ఎక్కొచ్చు. దేశం నలుమూలలా ఈజీగా ప్రయాణించేందుకు వీలుగా ఈ కార్డ్‌ని రూపొందించారు.

ఇక మీదట వన్ నేషన్ , వన్ కార్డు : ఎలా పొందాలో తెలుసుకోండి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లో నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్(ఎన్.సి.ఎమ్.సి)ని ప్రారంభించారు. ప్రస్తుతం మెట్రో రైలు వంటి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసుల్లో స్మార్ట్ కార్డు విధానం నడుస్తోంది.

దీనిని ఎలా పొందాలంటే...

డెబిట్, క్రెడిట్ లేదా ప్రిపెయిడ్ కార్డు రూపంలో బ్యాంకుల ఈ కార్డును జారీ చేస్తాయి. రూపే డెబిట్/క్రెడిట్ కార్డు మాదిరే ఉంటుంది. 25కు పైగా బ్యాంకుల్లో ఈ కార్డులు పొందొచ్చు. పేటీఎం పేమెంట్ బ్యాంకులు కూడా ఈ కార్డును జారీ చేస్తాయి.


కార్డు ద్వారా చెల్లింపులు

మెట్రో, బస్సు, రైల్వేస్, స్మార్ట్ సిటీ, రిటైల్ షాపింగ్ వంటి వాటికి ఈ కార్డు ద్వారా చెల్లింపులు జరపొచ్చు. టోల్ ప్లాజాల బిల్లులు, పార్కింగ్ చార్జీలు కూడా చెల్లించొచ్చు. కార్డు ద్వారా చెల్లింపులతో క్యాష్‌బ్యాక్ కూడా పొందొచ్చు.

క్యాష్ విత్‌డ్రా

విదేశాల్లో ఏటీఎం ద్వారా క్యాష్ విత్‌డ్రా చేసుకుంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. మర్చంట్ ఔట్స్‌లెట్స్‌లో చెల్లింపులపై 10 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. స్వాగత్, స్వీకార్ వంటి వాటిని కూడా ఈ కార్డు సపోర్ట్ చేస్తుంది. టీఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా కూడా ఈ కార్డును పొందొచ్చు.

స్మార్ట్ ట్రావెల్ కార్డు

పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మిషన్లలో ఈ స్మార్ట్ కార్డులను స్వైప్ చేస్తే చాలు. స్మార్ట్ ట్రావెల్ కార్డులను వినియోగించేందుకు టికెట్ కౌంటర్ల దగ్గర పీఓఎస్ మిషన్లలో స్వైప్ చేయడం ద్వారా ట్రావెల్ టికెట్ పొందొచ్చు. మెట్రో రైలు స్మార్ట్ కార్డుతో నేరుగా ఎలా అయితే ట్రైన్ టికెట్ కొంటున్నారో అలానే ఈ కార్డుతో కూడా ఈజీగా టికెట్ పొందొచ్చు. ఇప్పటికే ఢిల్లీ మెట్రో ఈ కార్డు విధానంపై టెస్ట్ రన్ ప్రారంభించింది.

ట్రయల్ రన్ ముగిశాక

అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిన ఆటోమెటిక్ ఫేర్ కలెక్షన్ కౌంటర్స్ (AFCs)ను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లు ప్రయాణికుల ఎంట్రీ, ఎగ్జిట్ వివరాలను రీడ్ చేస్తాయి. ఇప్పటివరకూ ఎఎఫ్సీ కౌంటర్లను కొన్ని మెట్రో స్టేషన్లకే పరిమితం చేశారు. ట్రయల్ రన్ ముగిశాక AFC కౌంటర్లను అన్నీ మెట్రో స్టేషన్లలో అమర్చనున్నారు.

డిజైన్ స్వదేశంలో...

విదేశాల్లో డిజైన్ చేయిస్తే భారీ స్థాయిలో ఖర్చు అవుతుందని, అందుకే ఎఎఫ్సీ కౌంటర్ల డిజైన్ స్వదేశంలో రూపొందించేలా తీసుకొస్తే మెట్రో రైలు నెట్ వర్క్ మొత్తానికి అయ్యే భారీగా ఖర్చును తగ్గించుకోవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు.

Taking this Information by https://telugu.gizbot.com/

No comments:

Post a Comment

గూగుల్‌ మ్యాప్‌ను తలదన్నే ఈ యాప్స్‌ గురించి మీకు తెలుసా? బెస్ట్‌ ఫీచర్స్‌

గూగుల్‌ మ్యాప్‌ను తలదన్నే ఈ యాప్స్‌ గురించి మీకు తెలుసా? బెస్ట్‌ ఫీచర్స్‌   Google Maps Alternative: ఇటీవల యూపీలో గూగుల్ మ్యాప్స్ కారణంగా ఓ ...