Translate

Sunday, April 7, 2019

కృష్ణ మంత్రాలు- మంత్రాల అర్థాలు అలాగే జపించడం వలన కలిగే లాభాలు

కృష్ణ మంత్రాలు- మంత్రాల అర్థాలు అలాగే జపించడం వలన కలిగే లాభాలు

శ్రీమహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణుని అవతారము. భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు సమస్త మానవాళికి గొప్ప సందేశాన్ని అందించాడు. నిజానికి, భగవద్గీతలో కృష్ణుని బోధనలను ఇప్పటి విద్యార్థులకు అలాగే ఉద్యోగులకు మోటివేషనల్ స్పీచెస్ లో వివరిస్తున్నారు కూడా. అంతటి ప్రాధాన్యత కలిగినవి శ్రీకృష్ణుని బోధనలు. మానవాళిని అన్నిరకాల బాధల నుంచి రక్షించేవాడని శ్రీకృష్ణుడిని కొలుస్తారు. ఈ రోజు ఈ ఆర్టికల్ లో శ్రీకృష్ణుని మంత్రాలూ వాటి అర్థాలు. వాటిని జపించడం వలన కలిగే లాభాలను తెలుసుకుందాం.



శ్రీకృష్ణుని మహామంత్రము 
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 

అర్థం: ఈ మంత్రంలో శ్రీమహావిష్ణువు అవతారలైన శ్రీరాముడిని అలాగే శ్రీకృష్ణుడిని స్తుతించడం జరిగింది. మానవాళికి విముక్తిని ప్రసాదించే శ్రీ వాసుదేవునికి నమస్కారాలను తెలియచేయుచున్నాము.

కృష్ణ భక్తి మంత్రం

"జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభూ నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసడై గౌర్ భక్తా వృంద" 
అర్థం:ఈ మంత్రంలో శ్రీకృష్ణుడి గొప్ప భక్తుల గురించి ప్రస్తావించబడి ఉంది. వారి ఆశీస్సులను కూడా అందించమని ప్రార్థించడం జరిగింది.

కృష్ణాష్టకం - 1
"వసుదేవ సూతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్" అర్థం వసుదేవ తనయా, నీవు కంసుని అలాగే చాణూరుని వంటి రాక్షసులను వధించిన శక్తివంతుడవు. దేవకీ మాతకు పరమానందాన్ని కలిగించావు. నీవు ఈ విశ్వానికే దేవుడవు. వాసుదేవునికి వందనం.

కృష్ణాష్టకం - 2"అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితం రత్న కనకన కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్" అర్థం అతసీ పుష్పాలను అలంకరించుకుని, కడియాలతో అలాగే దండలతో మెరుస్తున్న వాసుదేవుడు కుడిచేతికి రత్నాలతో చేయబడిన కడియాలు వేసుకున్నాడు. వాసుదేవునికి వందనం.
కృష్ణాష్టకం - 3 
"కుటిలలాకా సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననామ్ విలసత్ కుండల ధరమ్ కృష్ణం వందే జగద్గురుమ్" అర్థం శ్రీకృష్ణుని కురులు నల్లగా నిగనిగలాడుతున్నాయి. ముఖం చంద్రబింబంలా ప్రకాశిస్తోంది. చెవులు మెరుస్తున్నాయి. శ్రీకృష్ణునికి వందనం

కృష్ణాష్టకం - 4 
"మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింజావ చూదంగం కృష్ణం వందే జగద్గురుమ్" అర్థం మందార పూల పరిమళంతో మెరుస్తున్న శ్రీకృష్ణభగవానుడి చిరునవ్వు అలాగే నాలుగు చేతులూ అత్యంత సుందరమైనవి. శ్రీకృష్ణ పరమాత్ముని కురులపై నెమలి పింఛం కొలువైంది. శ్రీ వాసుదేవునికి వందనాలు.

శ్రీకృష్ణ పరమాత్ముని మంత్రాలను ఎలా జపించాలి: 
బ్రహ్మముహూర్త వేళలో అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల లోపు ఈ మంత్రాలను పఠిస్తే ఉత్తమం. ఉదయాన్నే స్నానం చేసి శ్రీకృష్ణుని పఠం ముందు కూర్చోవాలి. కృష్ణ మంత్రాన్ని తులసి మాలతో లెక్కపెట్టుకుంటూ 108 సార్లు పఠించాలి. జపమాలని మూడు వేళ్లపైన ఉంచి జపిస్తూ ఉండాలి. (చిటికెన వేలు, ఉంగరం వేలు అలాగే మధ్య వేలిని కలుపుతూ) బొటనవేలుని సపోర్ట్ గా వాడుకోవాలి. చూపుడువేలుని ఒంపుగా ఉంచాలి. సవ్యదిశలోనే జపమాలని తిప్పాలి.

కృష్ణ మంత్రాన్ని జపించడం వలన కలిగే లాభాలు అన్ని రకాల భయాలు అలాగే కలవరాలు తొలగిపోతాయి. ధైర్యం అలాగే ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. అన్నిరకాల వ్యాధులు నయమవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లోని వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సంపద వృద్ధి చెందుతుంది. ఇంట్లోని నెగటివ్ వైబ్రేషన్స్ తొలగిపోతాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రవేశిస్తాయి. విద్యార్థులు జ్ఞానం మెరుగవుతుంది. ఉద్యోగస్తుల అలాగే వ్యాపారులకు ఎదుగుదల అలాగే విజయం లభిస్తాయి.

No comments:

Post a Comment

How to Block a Program in a Firewall in 6 Steps (Easy Tutorial)

How to Block a Program in a Firewall in 6 Steps (Easy Tutorial) 1. Open the Settings for Windows Defender Firewall with Advanced Security  U...