Translate

Friday, July 1, 2022

🦎Lizards in House: బల్లులు ఎక్కువగా ఉంటే.... సింపుల్ చిట్కా ... ఈ సబ్బుతో ఎలా సాధ్యమో చూడండి..!*

 

🦎Lizards in House: బల్లులు ఎక్కువగా ఉంటే.... సింపుల్ చిట్కా ... ఈ సబ్బుతో ఎలా సాధ్యమో చూడండి..!*

Lizards in House: బల్లి ఈ పేరు వినగానే ఒళ్ళంతా జలదరించినట్టు ఉంటుంది.. బల్లి గోడ మీద గాని ఇంట్లో ఏదైనా ప్రదేశంలో తిరుగుతున్నట్టు కనిపిస్తే అటువైపు వెళ్లను కూడా వెళ్ళము.. అయితే బల్లులు ఇంట్లో తిరుగుతూనే ఉంటాయి.. బల్లి తినే ఆహార పదార్థాలలో పడితే విషం.. అలాగే ఒంటి మీద పడితే దోషమా మరి బల్లులు ఇంట్లో రాకుండా ఎలా చెక్ పెట్టాలి అని అనుకుంటున్నారా..! అయితే మీ కోసమే ఈ పరిష్కారం..!!

* ముందుగా కొన్ని ఉల్లిపాయలు తీసుకొని వాటిని మిక్సీ పట్టి అందులోని ఉల్లిపాయ రసం తీసి పక్కన పెట్టుకోవాలి.

2. 8 లవంగాలు, 10 మిరియాలు ఈ రెండింటినీ కలిపి పొడిలా చేసుకోవాలి.

3. ముందుగా తీసుకున్న ఉల్లిపాయ రసాన్ని లవంగాలు మిరియాలు పొడిని రసంలో కలిపి అందులో డెటాల్ సబ్బు ఒక చిన్న ముక్క కట్ చేసి ఆ రసంలో కలపాలి..

* డెటాల్ సబ్బు కాకపోతే మీకు నచ్చిన ఏదైన సోప్, లిక్విడ్ నైనా ఉపయోగించవచ్చు.

* ఇప్పుడు తయారుచేసుకున్న లిక్విడ్ ను గోడపై స్ప్రే చేయాలి.. లిక్విడ్ చిన్న కాటన్ బాల్ తో గోడమీద తలుపు చివర అంటిస్తే బల్లులు రాకుండా ఉంటాయి..

*సాధారణంగా ఉల్లిపాయ రసమే చాలా ఘాటుగా ఉంటుంది. అలాంటిది అందులో లవంగాలు, మిరియాలు కలిపితే మరింత ఘాటుగా ఉంటుంది. దీని వలన ఇంట్లోకి బల్లులు రాకుండా ఉంటాయి.

* ఒక సారి ఈ టిప్ ట్రై చేసి చూడండి రిజల్ట్ మీకే కనిపిస్తుంది..

- By mannamweb.com

No comments:

Post a Comment

How to Block a Program in a Firewall in 6 Steps (Easy Tutorial)

How to Block a Program in a Firewall in 6 Steps (Easy Tutorial) 1. Open the Settings for Windows Defender Firewall with Advanced Security  U...